ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్
వశిష్ట ప్రగతి, నరసాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్ట్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంస్థ నిర్వహించిన ఇంటర్మీడియట్ 2025 పరీక్షా ఫలితాల్లో నరసాపురం పట్టణానికి చెందిన ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్దులు ప్రభంజనం సృష్టించారు. ఎంపీసీ, బైపిసి విభాగాల్లో టౌన్ ఫస్ట్ మార్కులు సాధించడమే కాకుండా రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకులను కైవసం చేసుకున్నారు. సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో 1000 మార్కులకు 986 మార్కులను మోకా సూర్యనిఖిల్, 985 మార్కులను బొడ్డు త్రివేణి, మేడిది వెంకట సుజిత లు, 980 మార్కులను ఉప్పులూరి శ్రావణి, మండపాటి పృథ్వినటరాజ్ లు సాధించారని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్. వి రాఘవరెడ్డి తెలిపారు. సీనియర్ ఇంటర్మీడియట్ బైపిసి విభాగంలో 1000 మార్కులకు 987 మార్కులను గెడ్డం ఎలిజబెత్ శామ్యూల్, 986 మార్కులను వేండ్ర సృజన, 984 ముస్సి భవాని దుర్గ, పితాని డింపుల్ లు సాధించారని పేర్కొన్నారు. అదే విధంగా జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 464 మార్కులను చిక్కాల బాలజీ, అడ్డాల అమృత శ్రీ, 463 మార్కులను కరెళ్ళ హారిక, అండ్రాజు అనిల్ కుమార్, గన్నాబత్తుల లక్ష్మీ సత్య కళ్యాణ్, 462 మార్కులను పెదపల్లి షణ్విత వరశ్రీ, 462 మార్కులు, 461 మార్కులను విస్సా రుతిక దేవి శ్రీ, రావూరి భవాని సుబ్రమణ్యం శ్రీనివాస్ లు సాధించారని తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ బైపిసి విభాగంలో 440 మార్కులకు 435 మార్కులను తమ్మిశెట్టి సాహితి, 431 మార్కులను పాలంకి రమ్య శ్రీలక్ష్మీ, 430 మార్కులను తిరుమని పావని స్వరూపిని లు సాధించారని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడమే కాకుండా వారు భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకునేలా ఆదిత్య విద్యా సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని ఆదిత్య ప్రిన్సిపాల్ యస్ శివకోట ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి దుర్గాభవాని లు తెలియజేశారు. సీనియర్, జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపిసి విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, ప్రోత్సహించిన అధ్యాపకులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లిమిల్లి శేషారెడ్డి అభినందించారు.
Comments
Post a Comment