నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో కుంభకోణం
- నకిలీ డాక్యుమెంట్లతో రూ 4 కోట్లు రుణం
- బాధితుడు తిరుమాని నాగరాజు ఆవేదన
వశిష్ట ప్రగతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో భారీ కుంభకోణం జరిగింది. ఇరువురు వ్యక్తులతో పాటు  బ్యాంకు మేనేజర్ ఘరానా మోసానికి పాల్పడ్డారని సంచారం. 19 ఎకరాల రొయ్యల చెరువుకు సంబంధించిన నకిలీ  పత్రాలను సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో సుమారు రూ 4 కోట్లు రుణాన్ని 2024 సంవత్సరంలో కాజేసినట్లు తెలుస్తుంది.  వివరాళ్లోకి వెళ్తే నర్సాపురం మండలం సర్దుకోడప గ్రామానికి చెందిన తిరుమాని వడ్డికాసులు, పద్మ దంపతులకు వేములదీవి గ్రామంలో 19 ఎకరాల రొయ్యల చెరువు ఉంది.  వడ్డికాసులు 2020 సంవత్సరంలో మృతిచెందారు. ఆయన కుమారులు నాగరాజు, శ్రీనివాస్ లు నరసాపురం స్టీమర్ రోడ్డులో ఉన్న బ్యాంకులో  వారికి ఉన్న 19 ఎకరాల రొయ్యల చెరువు దస్తావేజులు చూపించి రుణం ఇవ్వమని కోరారు. దస్తావేజులు పరిశీలించిన ఆ బ్యాంకు అధికారి అప్పటికే నర్సాపురం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో మీరు రుణం పొందినట్లు ఉందని చెప్పడంతో నాగరాజు, శ్రీనివాస్ లు అవాక్కయ్యారు. వెంటనే  సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ప్రకాశమును వారికి జరిగిన అన్యాయంపై  నిలదీసి అడగడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. తిరుమాని వడ్డికాసులకు సంబంధించిన 19 ఎకరాల రొయ్యల చెరువుకు నకిలీ లీజు డాక్యుమెంట్లను సృష్టించి, 2020 సంవత్సరంలో చనిపోయిన తన తండ్రి వడ్డీకాసులు పేరు మీదుగా  ఫోర్జరీ సంతకాలు చేసి ఇరువురు వ్యక్తులకు రూ 3.99 కోట్లను బ్యాకు మేనేజర్ ప్రకాశము 2024 సంవత్సరంలో ఋణం ఇచ్చారని తెలిపారు. ఇటువంటి మోసాలను వెలికితీసి తమలాంటి బాధితులకు సంబంధిత అధికారులు న్యాయం చేయాలని నాగరాజు అన్నారు.   ఈ భారీ కుంభకోణానికి పాల్పడినా వారిని  వదిలే ప్రసక్తి లేదన్నారు. అక్కడ పరిస్తితి ఉత్రిక్తంగా మారడంతో ఎస్ఐ లు జయలక్ష్మి, ముత్యాలరావులు సెంట్రల్ బ్యాంకు మేనేజర్ ప్రకాశమును వివరాలు అడిగి డాక్యుమెంట్లను పరిశీలించారు. బాధితులు నాగరాజు, శ్రీనివాస్ లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐలు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం