జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం
వశిష్ట ప్రగతి, నరసాపురం: నరసాపురం పట్టణానికి చెందిన శ్రీ సూర్య కళాశాల ఐఐటీ, నీట్ అకాడమి విద్యార్థిణి, విద్యార్దులు ఇటీవల విడుదలైన జేఈఈ 2025 మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. 2025 మే జేఈఈ అడ్వాన్స్ కు అత్యుత్తమ పర్సంటైల్ సాధించి అర్హత పొందిన చామన ఉష శ్రీ, పోలిశెట్టి యేసమ్మ, పోతాబత్తుల మానసతులసి, అందే త్రినాథ్, రావి వినయలక్ష్మి, కొత్తా భవ్య, బడుగు అభిషై, యర్రంశెట్టి సాయిదుర్గ మౌనిక గౌరి, కొల్లాటి భవానిలను శ్రీ సూర్యా విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ ప్రత్యేకంగా అభినందించారు. కృషి, పట్టుదల ఉంటే ఇటువంటి విజయాలను సొంతం చేసుకోవచ్చునని బ్రహ్మాజీ అన్నారు. భవిష్యత్తులో కూడా వివిధ పోటీ పరీక్షలలో శ్రీ సూర్య విద్యా సంస్థల విద్యార్దులు జాతీయ, రాష్ట్రీయ ర్యాంకులను మరిన్ని కైవసం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద వహించడమే కాకుండా వారు భవిష్యత్తులో ఉన్నతస్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్నామన్నారు. సీనియర్ ఆధ్యాపక బృందంచే సిస్టమేటిక్, అకడమిక్ ప్లాన్, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్ తడితరమైనవి క్రమం తప్పకుండా జరపడం వల్ల తమ విద్యార్దులు ప్రతి విద్యా సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా జేఈఈ మెయిన్స్ లో ఘన విజయాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను బ్రహ్మాజీతో పాటు సీనియర్ ఫాకల్టీ డాక్టర్ ఏఆర్ఎస్ కుమార్, డాక్టర్ ఫాజిల్, బి. రామచంద్రారెడ్డి, డాక్టర్ జానకిరామ్, డాక్టర్ సతీష్, వేణుగోపాల్, పీ సత్యనారాయణ, కె. కరుణ్ కుమార్, టి. కృష్ణ గుప్తా లు అభినందనలు తెలియజేశారు.
Comments
Post a Comment