శ్రీశ్రీ మహా ప్రస్థానం భారీ పుస్తకాన్ని అందించిన కొప్పర్తి రాంబాబు
- Get link
- X
- Other Apps
నరసాపురం మండలం కొప్పర్రు గ్రామం పుస్తక పంపిణీ కేంద్రానికి ఆ గ్రామానికి చెందిన ఇండియన్ బ్యాంక్ విశ్రాంత ఏజీఎమ్ కొప్పర్తి రాంబాబు తన పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ శ్రీ మహాప్రస్థానం భారీ పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాంబాబు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, వ్యక్తిగతంగా చేస్తున్న సేవలను లైబ్రేరియన్ కమల కుమారి కొనియాడారు. శేషజీవితంలో సామాజిక మాధ్యమాలలో రూపొందించిన రామాయణం, మహాభారతం, కథలను ప్రతి ఒక్కరూ ఆదరిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో పోలిశెట్టి రమేష్ , చినమిల్లి వీరబాబు, నూకల రత్నాజి , కుంకటి చంద్రశేఖర్ లు పాల్గొన్నారు. శ్రీ శ్రీ మహాప్రస్థానం భారీ పుస్తకాన్ని విజయవాడకు చెందిన శ్రీ శ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావు సహకారంతో ముద్రించారమని, దీనిని చూసి చదవాలని కొప్పర్తి రాంబాబు కోరారు.
- Get link
- X
- Other Apps
Good
ReplyDelete