నరసాపురం పట్టణంలో జనంలోకి జనసేన
- Get link
- X
- Other Apps
నర్సాపురం జనసేన పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలో జనంలోకి జనసేన కార్యక్రమాన్ని జన సేన పార్టీ పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బొమ్మిడి నాయకర్ సతీమణి సునీత బుధవారం నిర్వహించారు.
జనసేన, బిజేపి, తెలుగుదేశం పార్టీలు పొత్తులో బాగంగా బలపరిచిన అభ్యర్ధులను గెలిపించాలని ప్రజల్ని సునీత కోరారు. వైసిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేసే జనసేన, తెదేపా, బిజేపి ఉమ్మడి ప్రభుత్వానికి అత్యధిక ఓట్లను ప్రజలు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్స్ తోట అరుణ, భారతి సురేష్, కొప్పాడ కృష్ణవేణి, బొమ్మిడి సూర్యకుమారి, సర్పంచ్ ఒడుగు ఏసు, నాయకులు జక్కం బాబ్జీ, వలవల నాని, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, వాతాడి కనకరాజు, నిప్పులేటి తారకరామారావు, గంటా కృష్ణ, గణేశ్న శ్రీరామ్, వాతాడి రమేష్, మైల వసంతరావు, వట్టిప్రోలు సతీష్, కొల్లాబత్తుల వెంకటేశ్వరరావు, పోలిశెట్టి సాంబ, తోట నాని, పోలిశెట్టి నళిని, వలవల సావిత్రి, కొణిదెల శ్రీను తదితర నాయకులు ఉన్నారు.
- Get link
- X
- Other Apps
Hi
ReplyDelete