వైఎన్ కళాశాల సెక్రటరీగా డాక్టర్ రామ సతీష్. -అభినందనలు తెలిపారు రంగారావు
వైఎన్ కళాశాల సెక్రటరీగా డాక్టర్ రామ సతీష్
- అభినందనలు తెలిపారు రంగారావు
వశిష్ట ప్రగతి: నరసాపురం వైఎన్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా డాక్టర్ అందే రామ సతీష్ త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గా సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందిస్తున్న డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు వైఎన్ కళాశాల వైస్ ప్రెసిడెంట్ గా మరింత సేవలు అందించనున్నారు. ఈ సందర్భంగా అందే రామ సతీష్ ను వైయస్ పాలెం మాజీ సర్పంచ్, వైఎన్ కళాశాల బిల్డింగ్ కమిటీ మాజీ సభ్యుడు కూనపరెడ్డి వీరవేంకట విజయ రంగారావు పుష్పగుచ్చంతో అభినందనలు తెలియజేశారు. కళాశాల అభివృద్ధికి మరింత సేవలు అందించి అందరి ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. అదేవిదంగా కళాశాల వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించనున్న డాక్టర్ చినమిల్లి సత్యనారాయణ కు, పాలకవర్గ సభ్యులకు అభినందనలను రంగారావు తెలిపారు.
Comments
Post a Comment