హస్తకళలకు పుట్టినిల్లు భారతదేశం, లేసు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకొస్తాం: మంత్రులు శ్రీనివాస్ వర్మ, రామానాయుడు


వశిష్ట ప్రగతి, నరసాపురం: హస్త కళలకు పుట్టినిల్లు మన భారత దేశమని, లేసు పరిశ్రమ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు లు అన్నారు. శనివారం నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామంలోని అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్లో  ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరగనున్న హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్ పో ప్రారంభోత్సవ వేడుకలను నరసాపురం, ఆచంట ఎమ్మేల్యేలు బొమ్మిడి నాయకర్, పితాని సత్యనారాయణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈపిసిహెచ్ ఎక్స్ చైర్మన్ ,(న్యూఢిల్లీ) ఆర్.కె.పస్సి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు ఆర్.కె. వెర్మ, జివీకే రామారావు,  ఆర్డీవో దాసి రాజు, డిఎస్పీ లు శ్రీ వేద, మానస, పొత్తూరి రామరాజు, కొవ్వలి రామ్మోహన్, మేకల సతీష్ సర్పంచ్ బందెల భారతిలతో కలిసి  కేంద్ర, రాష్ట్ర మంత్రులు వర్మ, రామానాయుడులు ప్రారంభించారు. హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్ పో లో బాగంగా ప్రదర్శన శాలలో ఉంచిన వివిధ రకాల చేతి వృత్తులను  పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఆధునిక యంత్రాలతో కాకుండా  చేతితో తయారు చేసిన ఉత్పత్తులే  హస్తకళలని అన్నారు. మారుమూల ప్రాంతాల్లో హస్తకళలలు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుందన్నారు. ఉత్పత్తిదారులను ప్రోత్సహించే విధంగా, వారికి  అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చే విధంగా ఈపీసీహెచ్ కృషి చేస్తుందన్నారు. చేతి వృత్తులను తయారు చేయడమే కాదు, అవి అమ్ముడయి, ఉత్పత్తిదారులు లాభాలు పొందే విధంగా ఈపిసిహెచ్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. నరసాపురం లేసు పరిశ్రమలకు, ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. హస్తకళలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనిన్నారు. 2014 సంవత్సరం  నుంచి దేశంలో ఉన్న హస్తకళలకు, వాటి నిర్వాహకులకు మంచి గుర్తింపు తీసుకొచ్చారన్నారు. దేశంలో మారుమూల ప్రాంతమైన  ఏటికొప్పాక గ్రామంలోని బొమ్మలను నరేంద్రమోడీ గుర్తించి వాటిని తయారు చేసే పెద్దలను  పద్మశ్రీ పురస్కారం ద్వారా గౌరవించిన విషయం అందరికి తెలిసిందేనని అన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే విధంగా దేశ ప్రభుత్వం హస్త కళలను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రతి మహిళ ఆర్థిక పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయన్నారు. ఈపిసిహెచ్ సంస్థ చేసే ఇటువంటి మంచి కార్యక్రమాలకు తమ సహాయ, సహకారాలు ఎల్లపుడూ ఉంటాయన్నారు. లేసు రంగాభివృద్దికి కృషిచేస్తున్న లేసు వ్యాపారవేత్తలు పితాని సత్యనారాయణ, సూర్యనారాయణ, కలవకొలను తులసీరావు, తాతాజీ తదితరులను అభినందించారు. పెదమైనవానిలంక గ్రామాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకుని చేసిన అభివృద్ధిని కొనియాడారు. చేనేత కార్మికులకు 200 విద్యుత్ యూనిట్లు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మంత్రి రామానాయుడు మాట్లాడుతూ  కంప్యూటరు యుగంలో ఉన్నప్పటికీ మానవుని మేధస్సు, సృజనాత్మక శక్తితో తయారు చేసిన హస్తకళలకు మంచి ప్రాధాన్యత, డిమాండు ఉందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో హస్త కళలకు మంచి ప్రాధాన్యత ఉందని, గత కొన్నేళ్లుగా ఈ పరిశ్రమకు ఆదరణ తగ్గిందని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లేసు  పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. నరసాపురం లేసు అల్లికలు, కలంకారి, ఏటికొప్పాక బొమ్మలు, ఉప్పాడ, ధర్మవరం, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలిలో వీణలు ఇలా ఎన్నో హస్త కళలు మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందినవన్నారు. ఏటికొప్పాక బొమ్మలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే చేతివృత్తులకు ఎంత ప్రాచుర్యం ఉందో.మందకు అర్థమవుతుందని అన్నారు. కోట్లు పెట్టి భవనాలు కట్టుకున్నప్పటికి లోపల మాత్రం చేతివృత్తులు ద్వారా తయారైన చేసుకున్న వస్తువులనే  అలంకరించుకుంటామన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేతివృత్తులు కళలకు, కళాకారులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  రానున్న కాలంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, రాష్ట్రాన్ని  అన్ని రంగాలుగా అభివృద్ది చేస్తామని,   హస్త కళలను, కళాకారులను మంచి ప్రోత్సాహం అందిస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ మహిళలు ఉపాధి అవకాశాలు పొందే విధంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఫర్ హ్యాండీ క్రాఫ్ట్స్ సంస్థ బాగా తోడ్పడుతుందని అన్నారు. ఈ సంస్థ భవిష్యత్తులో చేసే కార్యక్రమాలకు ప్రభుత్వపరంగా తాను పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.  కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ నర్సాపురం లేసుకు వందేళ్ల చరిత్ర ఉందని, లేసు అల్లికలు తయారు చేసిన వారందరికీ న్యాయం అందించేలా ఈపిసిహెచ్ కృషి చేస్తుందన్నారు. ఈపిసిహెచ్ సంస్థ ద్వారా రూ 32 వేల కోట్లు వ్యాపారం జరిగడం అభినందనీయమని, భవిష్యత్తులో 3 లక్షల కోట్లు వ్యాపారం జరగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా, ఎమ్మేల్యేగా తాను ఉన్న సమయంలో సామాన్య మహిళల జీవితాల్లో  వెలుగులు నింపే విధంగా  నర్సాపురంలో అంతర్జాతీయ లేసు ట్రేడ్ సెంటర్,  ఎల్ఈపిసిహెచ్, లేసు పరిశ్రమలను  నెలకొల్పామని అన్నారు. వీటి నిర్మాణంలో కలవకొలను తులసీరావు శక్తి వంచన లేకుండా పని చేశారని అన్నారు. ఆచంట ఎమ్మేల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో నర్సాపురంలో హ్యాండీ క్రాఫ్ట్స్ ఎక్స్ పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. దేశంలో ఉన్న చేతి వృత్తుల పరిశ్రమలకు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించాలన్నారు. తాను లేసు ఎక్స్ పోర్టర్ గా 5 దేశాలు తిరిగానని, తాను బ్రతకడానికి సరిపడా గౌరవం సంపాదించానని అన్నారు. కలవ కొలను తులసీరావు సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. ఐఎల్టిసి, ఈ పీ సి హెచ్ ద్వారా వేలాదిమంది మహిళలకు లేసు ఆల్లికలో శిక్షణ ఇచ్చి వారి ఆర్దికంగా ఎదిగే విధంగా కృషి చేశామని అన్నారు. లేసు ఎక్స్ పోర్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరో మూడు నెలల్లో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో ki డాక్టర్ చినమిల్లి సత్యనారాయణరావు,  శిరిగినీడి రాజ్యలక్ష్మి,  ఈపిసిహెచ్ డిప్యూటీ డైరెక్టరు రాకేష్ వర్మ, లేసు ఎక్స్ పోర్టర్స్ కలవ కొలను తాతాజీ, మాదాసు గోపాలకృష్ణ, అడ్డగళ్ల బాబు, కావలి నాని, దేవి మూర్తి తదితరులు ఉన్నారు. 

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం