మత్స్యకారులకు అండగా ఎన్డీయే ప్రభుత్వం: ఎమ్మేల్యే నాయకర్
వశిష్ట ప్రగతి, నరసాపురం: మత్స్యకారుల జీవన స్థితిగతుల్లో మార్పు తీసుకువచ్చి వారిని అభివృద్ధి చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. ఆదివారం నర్సాపురం ఎమ్మేల్యే కార్యాలయంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు బోట్ల డీజిల్ సబ్సిడీ కార్డులను నాయకర్ అందజేసి మాట్లాడారు. సిఎం చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ లు మత్స్యకారుల అభివృద్ధికి చిత్తశుద్దితో పనిచేస్తున్నారని అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు డీజిల్ పై అందిస్తున్న రాయితీని వినియోగించు కోవాలన్నారు కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మైల వసంతరావు, ఎన్డీయే శ్రేణులు తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment