పది పరీక్షలో ఆదిత్య ప్రభంజనం: 594 మార్కులతో సత్తా చాటిన శ్రీవల్లి

వశిష్ట ప్రగతి, నరసాపురం:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి 2025 విద్యా సంవత్సర పరీక్షా ఫలితాల్లో నరసాపురం పట్టణానికి చెందిన ఆదిత్య స్కూల్ విద్యార్దులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రభంజనం సృష్టించారు. పది పరీక్షలో 600 మార్కులకు గాను 594 మార్కులను కట్టా సాయి రత్న శ్రీవల్లీ వర్షిణి ప్రథమ స్థానాన్ని సాధించి ఆదిత్య విద్యా సంస్థల కీర్తి పతకాన్ని రెపరెప లాడించింది. అదే విధంగా 586 మార్కులను రావూరి శ్రీ నరసింహా గణేష్, 585 మార్కులను సయ్యద్ ఫరీదా, 584 మార్కులను దోసుల కరుణ, 582 మార్కులను షేక్ సనా మోహిఫిన్, బొచ్చుల నాగ శ్రీ, 581 మార్కులను చాగంటి శరణ్య శ్రీలక్ష్మి హర్షితలు సాధించారు. పది పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్లు యన్ శృతి రెడ్డి, ఎస్.వీ రాఘవరెడ్డిలు అభినందనలు తెలియజేశారు. తమ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని విద్యను అభ్యసించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని శృతిరెడ్డి, రాఘవరెడ్డిలు తెలిపారు.విద్యార్దులు మంచి ఫలితాలు సాధించుటకు తోడ్పడిన విద్యార్దుల తల్లిదండ్రులు, నాణ్యమైన బోధనను అందించిన పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా మరింత ఉత్సాహంతో మంచి మార్కులను తెచ్చుకోవాలన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కర్ణా రాజేష్, కాలేజి ప్రిన్సిపల్ యస్. శివకోట ప్రసాద్,  ఉపాధ్యాయులు తదితరులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను  అభినందించారు.

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం