పెంచిన ధరలను తగ్గించాలి -సిపిఎం త్రిమూర్తులు
వశిష్ట ప్రగతి, నరసాపురం: ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజల పైన రోజు రోజుకి ధరలు భారాలను మోపుతుందని సిపిఎం పట్టణ కార్యదర్శి ముచ్చర్ల త్రిమూర్తులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నరసాపురం 22 వార్డులో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల పైన భారాలు వేస్తూ ప్రజల సొమ్మును కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారనీ ఎద్దేవా చేశారు. బిజెపి కార్పొరేట్ ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఉన్న ప్రజానీకానికి నష్టదాయకమైనవన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కమిటీ సభ్యులు కోరాడ బద్రి, నోములు కొండ, బుడిది జోగేశ్వరరావు, పొన్నాడ మల్లేష్, కే సోమేశ్వరరావు, కోరాడ పార్వతి, టంకాని సుజాత తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment