పుప్పాల కృష్ణారావుకు మాతృవియోగం

వశిష్ట ప్రగతి:  నరసాపురం ప్రసిద్ధ దేవాలయమైన ఆదికేశవ ఎంబెరు మానార్ స్వామి ఆలయ వంశపారంపర్య  ట్రస్టీ చైర్మన్, న్యాయవాది పుప్పాల వేంకట కృష్ణారావు తల్లి చంద్రావతి (87) ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈమె భర్త విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి. చంద్రావతికి నలుగురు కుమారులు, ఇరువురు కుమార్తెలు కలరు. చంద్రావతికి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి గ్రంధి భవాని ప్రసాద్ మేనల్లుడే.   నరసాపురం 6 వార్డు కోవెల ప్రాంగణంలోని స్వగృహంలో ఉంచిన చంద్రావతి భౌతికకాయాన్ని పలువురు ప్రజా ప్రతినిదులు, అధికారులు, న్యాయవాదులు, నాయకులు, ప్రముఖులు, బంధుమిత్రులు తదితరులు సందర్శించి పూలమాలలతో నివాళులు అర్పించారు..

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం