విద్యతోనే ఉన్నత జీవితం -పది పరీక్షలో సత్తా చాటిన శ్రీ సూర్య విద్యార్ధులు. -అభినందించిన ఆర్డీవో దాసి రాజు


వశిష్ట ప్రగతి, నరసాపురం: 
విద్యతోనే ఉన్నత జీవితం, సమాజంలో గౌరవం లభిస్తుందని నరసాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ( ఆర్డీవో) దాసి రాజు అన్నారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2024 - 2025 విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్టేట్ ర్యాంకులను సాధించిన నరసాపురం పట్టణానికి చెందిన శ్రీ సూర్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్దులను ఆర్డీవో దాసి రాజు అభినందించారు. క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా శ్రీ సూర్య విద్యా సంస్థకు మంచి పేరు ఉందన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా నాణ్యమైన విద్యా బోధనను అందించడం అభినందనీయం అన్నారు. ప్రతి విద్యార్ధి పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, వారికి అవసరమైన సౌకర్యాలను అందించడం వల్లే పది పరీక్షలో మంచి ఉత్తీర్ణత సాధించారని వారికి తన అభినందనలు తెలియజేస్తున్నామని ఆర్డీవో రాజు అన్నారు. పది పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్దులు వారి ఆలోచనలకు అణుగుణంగా కోర్సులు తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఏ పరీక్షలోనైనా శ్రీ సూర్యా విద్యా సంస్థల విద్యార్దులు అత్యుత్తమ ఫలితాలు సాధించి అందరి అభినందనలు అందుకుంటున్నారని అన్నారు. ఇటివల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యధికశాతం శ్రీ సూర్యా విద్యార్దులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలు అర్హత సాధించారని అన్నారు. తీరప్రాంతంలోని పేద విద్యార్థుల జీవన పరిస్థితులను శ్రీ సూర్యా విద్యా సంస్థల అధినేత ఘంటసాల బ్రహ్మాజీ దృష్టిలో పెట్టుకొని నామమాత్రపు ఫిజులతో కళాశాలను నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. భవిష్యత్తులో కూడా పేద విద్యార్దులకు విద్యా సేవలను అందించాలని బ్రహ్మాజీకి సూచించారు. ఎస్.ఎస్.సి (పదో తరగతి) పరీక్షలో 600 మార్కులకు 593 మార్కులను ద్వారా అమృత మణి, 588 మార్కులను అందే ప్రసన్న, 587 మార్కులను పులపర్తి హిమ హాసిని, 575 మార్కులను పొన్నపల్లి హితేష్ కుమార్, 574 మార్కులను జనపరెడ్డి లిఖిత ఆదిత్య, 569 మార్కులను రావూరి నిఖిల హరిప్రియ, కడలి సిరి చంద్రిక, 567 మండెల లోహిత మహాలక్ష్మి, 561 మార్కులను బోనం గణేష్ శశి వరుణ్, 560 మార్కులను కారుమూరి రంగ ప్రియ, 552 మార్కులను చింతా హంసిని, 546 మార్కులను చింతా గిరీష్ సత్య, 544 మార్కులను అందే భవ్య మను శ్రీ, 543 మార్కులను చామకూరి భవ్య మను శ్రీ, 531 మార్కులను వడ్డీ లీలా సుబ్రహ్మణ్యం, 514 మార్కులను మాండ్రు సేతు, 508 మార్కులను గన్నాబత్తుల తను శ్రీ లు సాధించి శ్రీ సూర్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ సత్తాను చాటారు. 600 మార్కులకు 500 మార్కులకు పైగా 17 మంది విద్యార్దులు సాధించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులను ఆర్డీవో రాజు తో పాటు శ్రీ సూర్య విద్యా సంస్థల చైర్మన్ ఘంటసాల సూర్యనారాయణ, సెక్రెటరీ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, కళాశాల అకడమిక్ అడ్వైజర్  బి. రామచంద్రారెడ్డి, శ్రీ సూర్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ అకడమిక్ డైరెక్టర్  ఘంటసాల హేమవల్లి, ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ సతీష్, ఏవో పి. శ్రీనివాస్, ఇంచార్జ్ డి. శ్రీ కళ లు పుష్ప గుచ్చాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. నాగ శ్రీనివాస్,ఎమ్. రాజేష్, టి. కృష్ణ గుప్తా, సి హెచ్. కరుణ కుమార్, ఎమ్. శ్రీనివాస్, హారిక, లక్ష్మి, మేరీ కుమారి, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం