ఇంటర్మీడియట్ పరీక్షల్లో శ్రీగౌతమికి టౌన్ ఫస్ట్
వశిష్ట ప్రగతి, నరసాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నరసాపురం పట్టణానికి చెందిన శ్రీ గౌతమి జూనియర్ కళాశాల విద్యార్ధిణి, విద్యార్దులు అత్యుత్తమ మార్కులను సాధించి విజయభేరి మోగించారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 466 మార్కులను శ్రీ గౌతమి కళాశాలకు చెందిన తరపట్ల చైతన్య సాధించి టౌన్ ఫస్ట్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 కి 463 మార్కులను యన్. విషిత, యన్ భావన లు, 462 మార్కులను ఏ ఉజ్వల రాణి, 459 మార్కులను వై కీర్తి లు సాధించి శ్రీ గౌతమి కళాశాల కీర్తి పతకాన్ని రెపరెపలాడించారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 984 మార్కులతో బొడ్డు గోపిక కాలేజీ ఫస్ట్ ర్యాంకు సాధించింది. అదేవిదంగా బైపీసీ విభాగంలో 1000 కి 969 మార్కులను యం.డీ ఫరిహ సాధించింది. జూనియర్, సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచి అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థిణి, విద్యార్థులను శ్రీ గౌతమి విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చినమిల్లి దుర్గా ప్రసాద్ అభినందించారు. విద్యార్దులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, నిష్ణాతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యా బోధనను అందించడం వల్ల ప్రతి ఏటా తమ విద్యార్థిణి, విద్యార్దులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Post a Comment