మార్క్ శంకర్ క్షేమాన్ని కాంక్షిస్తూ నాయకర్ పూజలు
వశిష్ట ప్రగతి, నరసాపురం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు కొణిదెల పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ నరసాపురం మొగల్తూరు రోడ్డులోని భక్తాంజనేయస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే బొమ్మిడి నాయకర్ ప్రత్యేక పూజలు చేశారు. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారని, అందరి శ్రేయస్సును కోరుకునే పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ క్షేమంగా ఉండాలని ఆంజనేయునికి పూజలు చేశామన్నారు. కార్యక్రమానికి నాయకులు బొమ్మిడి సునీల్, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, చిరు పవన్ యువత నాయకులు కోపల్లి శ్రీనివాస్, చెన్నం శెట్టి నాగు, పిల్లా శ్రీహరి, పోలిశెట్టి సాంబా, గుగ్గిలపు శివరామకృష్ణ, అడ్డాల బాబీ, యాతం మహేష్ పొన్నమండ యుగంధర్ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment