చిదంబరానికి బళ్ల కృష్ణ అభినందనలు
వశిష్ట ప్రగతి, నరసాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు న్యాయవాదుల సంఘ ( బార్ అసోసియేషన్ ) అధ్యక్షుడుగా రెండో పర్యాయం అఖండ మెజారిటీతో విజయం సాధించిన కలిగినీడి చిదంబరంను నరసాపురం చిన మామిడిపల్లి స్వగృహంలో ప్రముఖ వ్యాపారవేత్త బళ్ల మురళీ కృష్ణ కలిశారు. అభినందన జ్ఞాపికను అందజేసి శాలువా, పూల దండలతో ఆత్మీయ సత్కారం చేశారు. హై కోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షుడుగా చిదంబరం ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో రెండోసారి గెలుపొందడం తమ ప్రాంతానికి గర్వకారణం అన్నారు. చిదంబరం సేవలను కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని అందరి ఆదరాభిమానాలు పొందాలని కృష్ణ ఆకాంక్షించారు.
Comments
Post a Comment