సేవాభావంతో ఉండాలి :కోటిపల్లి సురేష్
వశిష్ట ప్రగతి, నరసాపురం: ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలని మున్సిపల్ ప్రజా ప్రతినిధి కోటిపల్లి సురేష్ కుమార్ అన్నారు. శనివారం నరసాపురం చిన కనకదుర్గమ్మ (చిట్టితల్లి) ఆలయం వద్ద మల్లిపట్టు దుర్గా సునీత, సందీప్, ఈశ్వర్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని సురేష్ ప్రారంభించి మాట్లాడారు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని, అన్నదానం పవిత్రమైనదన్నారు. ఆలయ ధర్మకర్త బొడ్డు కృష్ణ భగవాన్, గాడి శ్రీను, చింతా భోగేశ్వరరావు, మూపితి లక్ష్మి నారాయణ, పట్నాల రమేష్ తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment