ఇంటర్ ఫలితాల్లో శ్రీసూర్య విద్యార్థుల ప్రభంజనం :అభినందనలు తెలిపిన బ్రహ్మాజీ
వశిష్ట ప్రగతి, నరసాపురం: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో నర్సాపురం శ్రీ సూర్య జూనియర్ కళాశాల విద్యార్థులు మరో సారి ప్రభంజనం సృష్టించారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో 2024 -25 ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సర ఎంపిసి ఫలితాల్లో 470 మార్కులకు గాను 464 మార్కులను శ్రీ సూర్య కళాశాల విద్యార్థి కోలా యశ్వంత్ బాల మణికంఠ సాధించి సత్తా చాటారు. అదే విధంగా 470 మార్కులకు 463 మార్కులను పొన్నాడ కీర్తన ప్రమీల, పురోహిత్ ప్రసన్న లు, 462 మార్కులను వీరవల్లి యామిని శ్రీ విఘ్నేశ్వరి, 460 మార్కులను కుచెర్లపాటి మౌనిక శ్రీ, 459 మార్కులను పెద్దింటి తేజస్విని, 458 మార్కులను మొగడా చైతన్య శ్రీ వీర సాయి నాగేంద్ర, కంచర్ల నాగ హరిణి, పరసా విజయ బాబు, 457 మార్కులను, ఆకన చరిష్మా, కవురు చరిష్మా, చినిమిల్లి మహా శ్రీ మౌనిక, ముత్యాల దేవి కృప లు సాధించారు. ఎంపీసీ విభాగంలో 500 మార్కులకు గాను కురగంటి లక్ష్మి భానుజ 466 సాధించారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 983 మార్కులను చామన ఉష శ్రీ, 982 మార్కులను రావి వినయలక్ష్మి, 975 మార్కులను పోలిశెట్టి ఏసమ్మ, 973 మార్కులను అడబాల రోషిణి, పాలా యామిని , 971 మార్కులను గిరిగి విశాలాక్షి , పులపర్తి రవి సాయి కార్తీక్ లు, 970 మార్కులను పోతాబత్తుల మానస తులసి, ద్వితీయ సంవత్సర బైపిసి విభాగంలో 1000 మార్కులకు 972 మార్కులను కొల్లాబత్తుల యెమీమా, 966 మార్కులను కోటి జ్ఞాన దీప్తి 966 సాధించారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేసిన శ్రీ సూర్య కళాశాల విద్యార్థిణి, విద్యార్థులను ఆ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ పుష్పగుచ్చాలతో అభినందించారు. ఒడిదుడుకులను తట్టుకునే విధంగా తయారు చేయాలన్నదే సూర్య కళాశాల లక్ష్యమని బ్రహ్మాజీ ఆనందం వ్యక్తం చేశారు. తమ కళాశాల విద్యార్ధులలో మొదటి నుంచి ఆత్మవిశ్వాసం, నమ్మకం, కష్టించి పని చేయడం లాంటి విషయాల పట్ల మానసిక నిపుణులతో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు సాదిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్ అధ్యాపకులు బి. రామచంద్రరెడ్డి, డాక్టర్ ఏఆర్ఎస్ కుమార్, డాక్టర్ ఫాజల్, డాక్టర్ కె.జానకి రామ్, ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ యు. లక్ష్మీ కాంత్, డిగ్రీ ప్రిన్సిపాల్ పి. పుల్లారావు, డిగ్రీ అకడమిక్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ గుప్తా, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment