విద్యుత్ సరఫరా నిలిపివేత: ఇఈ మధుకుమార్

వశిష్ట ప్రగతి: నరసాపురం 33/ 11 కేవీ పై ఉన్న 11 కేవీ వలందరు రేవు లైన్ మరమ్మత్తుల నిమిత్తం బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని విద్యుత్ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కే మధుకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపురం పట్టణం మద్దిపట్లవారి వీధి, మూడు బొమ్మల సెంటర్, పాత బజార్,  పంజా సెంటర్ ప్రాంతాల్లో సుమారు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు. 

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం