ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్
వశిష్ట ప్రగతి, నరసాపురం: బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నరసాపురం పట్టణానికి చెందిన ఆదిత్య కళాశాల విద్యార్థులు టౌన్ ఫస్ట్ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. జూనియర్ ఇంటర్మీడియట్ యం.పి.సి విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులను రావూరి భవాని సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ కైవసం చేసుకుని ఆదిత్య విద్యా సంస్థల కీర్తి పతకాన్ని రెపరెపలాడించారు. అదేవిదంగా 470 మార్కులకు గాను 465 మార్కులను పెదపల్లి షన్విత వరసాయి, విస్సా రుతిక దేవిశ్రీ, ఎలిమర్తి జబదై కుమార్, తంగెళ్ల వైష్ణవి, గన్నాబత్తుల లక్ష్మీ సత్య కళ్యాణ్, చిక్కాల బాలాజీ, కరెళ్ల హారిక, గోపు భార్గవి, మల్లుల నవ్యశ్రీ, గుత్తుల వేణి మధుశ్రీ, ములపర్తి హేమకుమారి లు సాధించి ఆదిత్య కళాశాల సత్తాను చాటారు. 464 మార్కులను అడ్డాల అమృత శ్రీ, జంద్యాల వెంకట శృతి, కోపనాతి రామ్ చరణ్, ఆకన సారిక లక్ష్మీ లు సాధించారు. 460 కి పైగా మార్కును 24 మంది విద్యార్దులు సొంతం చేసుకున్నారు. జూనియర్ ఇంటర్మీడియట్ బైపిసి విభాగంలో 440 మార్కులకు 435 మార్కులను తమ్మిశెట్టి సాహితీ, పాలింకి రమ్యశ్రీ లక్ష్మీ, 431 మార్కులను పాలపర్తి సుభిన్ శ్యామ్, ముద్దాల ధన దీప్తి, 430 మార్కులను తిరుమాని పావని స్వరూపిణి, 429 మార్కులను కొల్లాబత్తుల రేష్మా లు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి టౌన్ ఫస్ట్, స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్ధిని, విద్యార్దులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ దీపక్ రెడ్డి, డైరెక్టర్ ఎస్.వి రాఘవరెడ్డి లు అభినందించారు. ప్రతి విద్యార్ధిపైన ప్రత్యేక శ్రద్ధ, నాణ్యమైన విద్యా బోధనను అందించడం వల్లే ఈ అత్యుత్తమ ఫలితాలను ప్రతి ఏటా సాధిస్తున్నామని వారు అన్నారు. ఈ విజయంలో భాగస్వాములైన విద్యార్దులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపి ఆదిత్య అధ్యాపకులను, సిబ్బందిని అభినందించారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్దులకు కళాశాల ప్రిన్సిపాల్ శివకోట ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ దుర్గా భవానీ లు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Post a Comment