స్వర్ణాంధ్రాలో పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్

వశిష్ట ప్రగతి, నర్సాపురం: స్వర్ణాంధ్రా పోలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సెలింగ్ సెంటరును ఏర్పాటు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యామండలి ఉత్తర్వులను జారీచేసిందని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ విద్యా సంస్థల  ఛైర్మన్ కొండవీటి సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి వెంకటేశ్వరస్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్మయిలు ఒక ప్రకటనలో తెలిపారు. 2023 సంవత్సరం నుంచి పాలిసెట్ పరీక్షలను నరసాపురం మండలం సీతారామ పురం గ్రామంలో ఉన్న స్వర్ణాంధ్రా పాలిటెక్నిక్ కాలేజి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. పాలిసెట్ 2025 విద్యా సంవత్సరంలో  ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ ఈ నెల 21 వ తేది నుంచి  28 వ తేది వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటలకు  రోజుకు 15,000 ర్యాంకుల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని వారు పేర్కొన్నారు.   ఆప్షన్స్ 25 వ తేది నుండి 30 వ తేది వకు పెట్టుకోవచ్చనన్నారు. జూలై 7 న అలాట్మెంట్ లిస్టు వస్తుందని, అలా సీటు కేటయించబడిన విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ వస్తుందన్నారు. విద్యార్థులు దూరప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా దగ్గరలో నివశించేవారికి సాంకేతిక విద్యామండలి ఈ అవకాశాన్ని విద్యార్దులు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు పాలిటెక్నిక్ కశాశాలలో సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. 

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం