ఈఏపీ సెట్లో శ్రీసూర్యా విద్యార్ధుల ప్రభంజనం -స్టేట్ ర్యాంకులతో విజయభేరి

వశిష్ట ప్రగతి: నర్సాపురం పట్టణానికి చెందిన శ్రీ సూర్య కళాశాల విద్యార్దులు ఆదివారం విడుదలైన ఈ ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు.  గతంలో ఎన్నడు లేని విధంగా ఈఏపీ సెట్ ఫలితాల్లో విజయభేరి మోగించిన విద్యా సంస్థగా శ్రీ సూర్య జూనియర్ కాలేజీ రికార్డును కైవసం చేసుకుంది. నరసాపురం పట్టణంలోనే ప్రప్రథమంగా  రికార్డు స్థాయిలో ఇంత మంచి ఈ.ఏ.పి సెట్ ర్యాంకులను విద్యార్దులు సొంతం చేసుకోవడం వల్ల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.  ఇటువంటి పోటీ పరీక్షల్లో శ్రీ సూర్య విద్యా సంస్థల విద్యార్దులు చరిత్రను సృష్టించడం పట్ల పలువురు ప్రముఖులు,  ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు తదితరులు అభినందించారు. 3411వ ర్యాంకును సిహెచ్ ఉష శ్రీ, 6241వ ర్యాంకును పి ముఖేష్, 10,851 ర్యాంకును యం. బబ్లూ, 12,190 ర్యాంకును పోతాబత్తుల  మానస తులసి, 12982 ర్యాంకును పి భానుప్రసాద్, 13,192 వ ర్యాంకును ఏ త్రినాథ్, 15,496 ర్యాంకును బి సంజన భార్గవి, 16,560 ర్యాంకును పి ధనశ్రీ, 16,900 యన్. సాయి గణేష్, 17,623 ర్యాంకును పి యేసమ్మ, 18224 ర్యాంకును జీ విశాలాక్షి, 20,953 ర్యాంకును ఏ. రోషిణి, 21,000 కే సంధ్య, 21,450 ర్యాంకును పి రవి లు సాధించారు. బైపీసీ విభాగంలో వి. కుసుమ వల్లి  2,587 ర్యాంకుతో పాటు కె. శ్రావణి దేవి, కె. కవిత, పి. లాస్యశ్రీ గీత  ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ ర్యాంకులతో పాటు మరెన్నో  సీటు గ్యారెంటీ ర్యాంకులను శ్రీ సూర్య విద్యా సంస్థల  విద్యార్థినీ విద్యార్థులు సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ ఫలితాలు, ర్యాంకులు సాధించిన విద్యార్ధులను శ్రీ సూర్య విద్యా సంస్థల  సెక్రటరీ  కరస్పాండెంట్  ఘంటసాల బ్రహ్మాజీ అభినందించారు. 2025 సంవత్సర ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులను  శ్రీ సూర్య విద్యా సంస్థ విద్యార్దులు సాధించి అగ్రగామిగా నిలవడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. నిర్దిష్టమైన ప్రణాళికతో,  అనుభవం కలిగిన అధ్యాపకులచే శిక్షణ ఇవ్వడం వల్ల తమ విద్యార్దులు ఈ అత్యుత్తమ ఫలితాలు సాధించారని అన్నారు. ఏపీ ఈఏపీ సెట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులను బ్రహ్మాజీతో పాటు అధ్యాపకులు డాక్టర్ ఏఆర్ఎస్  కుమార్, బి. రామచంద్ర రెడ్డి, డాక్టర్ ఫాజల్, డాక్టర్ కె. జానకిరామ్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ యు. లక్ష్మీ కాంత్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి. పుల్లారావు,డిగ్రీ అకడమిక్ ప్రిన్సిపల్ టి. కృష్ణ గుప్తా, సిహెచ్ కరుణ కుమార్, , కె. వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, పి. ఎల్. వెంకటేష్, జాస్తి సుబ్బారావు, కళాశాల అభినందనలు తెలియజేశారు.

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం