ఈఏపీ సెట్ ఫలితాల్లో శ్రీసూర్యాకు స్టేట్ ర్యాంకులు. -అభినందించిన ఎమ్మెల్యే నాయకర్
వశిష్ట ప్రగతి, నర్సాపురం: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో నరసాపురం పట్టణానికి చెందిన శ్రీ సూర్యా కళాశాల విద్యార్థిని, విద్యార్దులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్ధుల భవితవ్యానికి బంగారు బాటలు వేస్తున్న శ్రీ సూర్యా విద్యా సంస్థల అధిపతి ఘంటసాల బ్రహ్మాజీతో పాటు కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులు, సిబ్బందిని ప్రశంసించారు. ఈఏపీ సెట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వి.కుసుమ వల్లి (2,587), సిహెచ్ ఉషశ్రీ (3,411), పి. ముఖేష్ (6,241) లతో పాటు 15,000 లోపు ర్యాంకులు సాధించిన 17 మంది విద్యార్దులను ఎమ్మెల్యే నాయకర్ పుష్పగుచ్చాలతో సత్కరించారు. బీటెక్ తర్వాత ఎంటెక్, పిహెచ్డి, గేట్ వంటి ఉన్నత కోర్సులను విద్యార్దులు అభ్యసించి శాస్త్రవేత్తలుగా స్థిరపడాలని, తద్వారా దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నాయకర్ విద్యార్దులకు సూచించారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వంచే ప్రతిభా పురస్కారాన్ని అందుకున్న శ్రీ సూర్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని ద్వార అమృతమణిని నాయకర్ సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఏఆర్ఎస్ కుమార్, బి. రామచంద్ర రెడ్డి, డాక్టర్ ఫాజల్, డాక్టర్ కె. జానకిరామ్, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ యు. లక్ష్మీ కాంత్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ పి. పుల్లారావు, డిగ్రీ అకడమిక్ ప్రిన్సిపల్ టి. కృష్ణ గుప్తా, సిహెచ్ కరుణ కుమార్, , కె. వేణుగోపాల్, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, పి. ఎల్. వెంకటేష్, జాస్తి సుబ్బారావు, ఆఫీస్ సిబ్బంది విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.
Comments
Post a Comment