14న కాపు, తెలగా ఆత్మీయ వనసమారాధన
భగవాన్ న్యూస్: నర్సాపురం నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు, తెలగా ఆత్మీయ వన సమారాధనను విజయవంతంగా నిర్వహిస్తున్నామని కాపు సంఘ నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సురేష్ కుమార్, ఆహ్వాన కమిటీ సభ్యులు తమ్మిశెట్టి బాబ్జీ, అడబాల అయ్యప్ప నాయుడు, కావలి నాని, పులపర్తి ప్రతాప్, గుగ్గిలపు మురళీ, పులఖండం వీర రాఘవులు, యర్రంశెట్టి నాగేశ్వరరావులు అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న నర్సాపురం మండలం సీతారామపురం లేసు పార్క్ పక్కన గల కొండవీటి వారి తోటలోనే ఈ ఏడాది కూడా కాపు, తెలగా సకుటుంబ సమేత వన సమారాధనను 14 వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు ఉసిరిచెట్టుకు పూజ చేసి వన సమారాధనను ప్రారంభిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఉన్నత హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు హాజరై కాపు జాతి ఐక్యతను చాటుతారని తెలిపారు. పిల్లలకు అవసరమైన ఆటలు, క్రీడలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. మహిళలకు మోహేంది, కుర్చీలాట తదితర ఆటలు జరుగుతాయని తెలిపారు. వివిధ వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. నరసాపురం నియోజకవర్గంలోని వేలాదిమంది కాపు, తెలగా సంఘీయులు కుటుంబ సమేతంగా విచ్చేసి కాపు, తెలగా ఆత్మీయ వన సమారాధనను విజయవంతం చేయాలని కోరారు.
Comments
Post a Comment