కార్యకర్తలకు అండగా తెదేపా: పొత్తూరి రామరాజు

భగవాన్ న్యూస్, నరసాపురం: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని ఆ పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇంచార్జి పొత్తూరి రామాంజనేయరాజు (రామరాజు) అన్నారు. సోమవారం నరసాపురం పట్టణం 31వ వార్డులో తెదేపాకు చెందిన కొండేటి జాన్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందారు. ఈ సందర్భంగా జాన్ కుటుంబ సభ్యులకు రూ 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మత్స్యకార సంఘాల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, కౌన్సిలర్ పాలూరి బాబ్జీల చేతుల మీదుగా రామరాజు అందజేశారు. ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. జాన్ పార్టీకి చేసిన సేవలను తెలియజేశారు. 31వ వార్డు టిడిపి అధ్యక్షులు పాలూరి విఘ్నేశ్వర ప్రసాద్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాగిడి రాంబాబు తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం