బాధ్యతగా విధులు నిర్వహించాలి:ఎమ్మెల్యే నాయకర్
భగవాన్ న్యూస్, నరసాపురం: పారిశుధ్య పనులను మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం నరసాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత ఉద్యోగులు, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని ఆర్డీవో రాజు, కౌన్సిలర్స్, కమిషనర్ తో కలిసి నిర్వహించారు. పట్టణంలో చెత్త డంపింగ్ సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రజలకు పారిశుధ్య పనుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. పట్టణాభివృద్ధి, సంక్షేమం, మంచి ఆరోగ్యమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కమిషనర్ అంజయ్యను పలు అంశాలపై వివరణ అడిగారు. సమావేశంలో కౌన్సిలర్స్ వన్నెంరెడ్డి శ్రీనివాస్, కొప్పాడ కృష్ణవేణి, కోటిపల్లి సురేష్, పాలూరి బాబ్జీ, కేసరి గంగరాజు, భారతి సురేష్, బొమ్మిడి సూర్యకుమారి, తోట అరుణ, జనసేన పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు, గోరు సత్తిబాబు తదితరులు ఉన్నారు.
Comments
Post a Comment