ఐక్యతతోనే బీసీలకు రాజ్యాధికారం –బీసీ సంఘ అధ్యక్షుడుగా పెమ్మాడి రాజు


భగవాన్ న్యూస్,  నరసాపురం: బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దాడ గణేష్ భవాని యాదవ్ అన్నారు. శుక్రవారం నర్సాపురం రాజగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం నర్సాపురం నియోజకవర్గ అధ్యక్షడుగా నర్సాపురం పట్టణానికి చెందిన పెమ్మాడి దుర్గా వెంకట గణపతి రాజును ఏకగ్రీవంగా ఎంపిక చేసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముద్దాడ గణేష్ భవాని మాట్లాడుతూ చట్టసభల్లో  బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు 50 శాతం అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఏ, బి, సీ, డి లుగా విభజించి అమలు చేయాలన్నారు. దేశంలో 2675 బీసీ కులాలు,  రాష్ట్రలో 139 బీసీ కులాలు ఉన్నాయన్నారు. బీసీలకు భిక్షం వద్దు, రాజ్యంగబద్దంగా రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. తేదేపా అగ్నికులక్షత్రియ సాధికారత కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, న్యాయవాది వైదాని నాగేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కృష్ణ భగవాన్  లు మాట్లాడుతూ పేద కులాలకు గౌరవం అధికారం ద్వారానే సాధ్యమౌతుందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీ నినాదం అత్యంత బలంగా ఉందన్నారు.  అందుకు రాజ్యాంగాన్ని సవరించి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రానున్న రోజుల్లో దేశంలో బీసీ విప్లవం తప్పదని, జనాభా దమాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించేందుకు పార్లమెంట్‌లో రాజ్యంగ సవరణ చేయాలన్నారు.  పెమ్మాడి గణపతి రాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘ నర్సాపురం నియోజకవర్గ అధ్యక్షుడుగా ఎంపిక చేయడం పట్ల ఆర్ కృష్ణయ్యకు, గణేష్ భవానికి కృతజ్ఞతలు తెలిపారు. పాలకొల్లులో ఆదివారం మధ్యాహ్నం జరిగే తనతో పాటు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారానికి బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని రాజు కోరారు. ఈ సందర్భంగా నర్సాపురం నియోజకవర్గ అధ్యక్షుడుగా పెమ్మాడి దుర్గ వేంకట గణపతి రాజు, నర్సాపురం  పట్టణ మహిళ కార్యదర్శిగా  మల్లాడి కృష్ణవేణి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కరణం రాంబాబు,   కార్యదర్శిగా పొన్నమండ రమణ కుమార్,  నరసాపురం మండల వర్కింగ్ అధ్యక్షులుగా కంకటాల సాయికుమార్. మండల కార్యదర్శిగా పెదపట్నం పాండురంగారావు, పట్టణ కార్యదర్శిగా జవ్వది సుబ్బారావు,  పట్టణ కోశాధికారిగా కొప్పుల శంకరం,  పట్టణ ఎంప్లాయిస్ విభాగ అధ్యక్షులుగా పెమ్మాడి అనంత కృష్ణంరాజు, పట్టణ ఉపద్యక్షులుగా చాగంటి గంగాజలం లను నియమిస్తూ నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ అధ్యక్షులు మూసే శ్రీనివాస్ యాదవ్, బస్వాని నాగమణి,  మోకా సుబ్రమణ్యం, సంగాని  వెంకటేశ్వరావు, పుల్లూరి నరేష్ గౌడ్ వాకా పూర్ణచంద్రరావు, పొన్నమండ నాగేశ్వరావు, శిడగం రవి శేఖర్ తదితరులు ఉన్నారు.

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం