కొండవేటి కృష్ణ ప్రసాద్ ఇక లేరు
భగవాన్ న్యూస్: నర్సాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండవేటి కృష్ణ ప్రసాద్ (72) హైదరాబాద్లో శనివారం మృతి చెందారు. స్వగ్రామమైన సీతారామపురం గ్రామంలో అత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ ప్రసాద్ కు భార్య నాగమణి, కుమార్తె శ్రీదివ్య కలరు. కృష్ణ ప్రసాద్ భౌతికకాయాన్ని మాజీమంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరామ్ తదితర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు , నాయకులు, బంధుమిత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Comments
Post a Comment