జగన్ దృష్టికి నర్సాపురం సమస్యలు: తెలియజేసిన బర్రి దంపతులు

భగవాన్ న్యూస్, అమరావతి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ చైర్ పర్సన్ బర్రి శ్రీవెంకట రమణ, కౌన్సిపర్ జయరాజు దంపతులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల  నర్సాపురం మున్సిపాలిటీలో నెలకొన్న పరిణామాలను, కమిషనర్ తీరును వివరించామని సామాజిక మాధ్యమం ద్వారా వారు విలేకర్లకు తెలియజేశారు. నర్సాపురంలో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపకుండా గత వైసీపీ ప్రభుత్వంలో 8 వేల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన నర్సాపురం మంగళగుంట పాలెం స్థలంలో  చెత్తను డంప్ చేయాలని ఎన్డీయే కూటమి ప్రజా ప్రతినిధులు చూస్తున్నారని జగన్ కు తెలిపారు. దీనిని అడ్డుకున్న తమను ఎన్డీయే కూటమికి చెందిన కౌన్సిలర్లను బయటకు రాకుండా మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశామని తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అక్రమాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, వైయస్సార్ పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చినట్లు వెంకట రమణ జయరాజు దంపతులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ఇంటర్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

జేఇఈ మెయిన్స్ లో శ్రీ సూర్య ప్రభంజనం: అభినందించిన కళాశాల యాజమాన్యం

నరసాపురం సెంట్రల్ బ్యాంకులో భారీ కుంభకోణం