Posts

జగన్ దృష్టికి నర్సాపురం సమస్యలు: తెలియజేసిన బర్రి దంపతులు

Image
భగవాన్ న్యూస్, అమరావతి:  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన స్వగృహంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ చైర్ పర్సన్ బర్రి శ్రీవెంకట రమణ, కౌన్సిపర్ జయరాజు దంపతులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల  నర్సాపురం మున్సిపాలిటీలో నెలకొన్న పరిణామాలను, కమిషనర్ తీరును వివరించామని సామాజిక మాధ్యమం ద్వారా వారు విలేకర్లకు తెలియజేశారు. నర్సాపురంలో డంపింగ్ యార్డు సమస్యకు పరిష్కారం చూపకుండా గత వైసీపీ ప్రభుత్వంలో 8 వేల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన నర్సాపురం మంగళగుంట పాలెం స్థలంలో  చెత్తను డంప్ చేయాలని ఎన్డీయే కూటమి ప్రజా ప్రతినిధులు చూస్తున్నారని జగన్ కు తెలిపారు. దీనిని అడ్డుకున్న తమను ఎన్డీయే కూటమికి చెందిన కౌన్సిలర్లను బయటకు రాకుండా మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశామని తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అక్రమాలను ధైర్యంగా ఎదుర్కోవాలని, వైయస్సార్ పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చినట్లు వెంకట రమణ జయరాజు దంపతులు తెలిపారు.

ఐక్యతతోనే బీసీలకు రాజ్యాధికారం –బీసీ సంఘ అధ్యక్షుడుగా పెమ్మాడి రాజు

Image
భగవాన్ న్యూస్,  నరసాపురం:  బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దాడ గణేష్ భవాని యాదవ్ అన్నారు. శుక్రవారం నర్సాపురం రాజగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం నర్సాపురం నియోజకవర్గ అధ్యక్షడుగా నర్సాపురం పట్టణానికి చెందిన పెమ్మాడి దుర్గా వెంకట గణపతి రాజును ఏకగ్రీవంగా ఎంపిక చేసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముద్దాడ గణేష్ భవాని మాట్లాడుతూ చట్టసభల్లో  బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు 50 శాతం అమలు చేయాలన్నారు. స్థానిక సంస్థలలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఏ, బి, సీ, డి లుగా విభజించి అమలు చేయాలన్నారు. దేశంలో 2675 బీసీ కులాలు,  రాష్ట్రలో 139 బీసీ కులాలు ఉన్నాయన్నారు. బీసీలకు భిక్షం వద్దు, రాజ్యంగబద్దంగా రావాల్సిన హక్కులను కల్పించాలన్నారు. తేదేపా అగ్నికులక్షత్రియ సాధికారత కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పాడ రవీంద్రనాథ్ ఠాగూర్, న్యాయవాది వైదాని నాగేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు కృష్ణ భగవాన్  లు మాట్లాడుతూ పేద కులాలకు గౌరవం అధికారం ...

14న కాపు, తెలగా ఆత్మీయ వనసమారాధన

Image
భగవాన్ న్యూస్ :  నర్సాపురం  నియోజకవర్గ కాపు సంఘం ఆధ్వర్యంలో  కాపు, తెలగా ఆత్మీయ వన సమారాధనను విజయవంతంగా నిర్వహిస్తున్నామని కాపు సంఘ నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సురేష్ కుమార్, ఆహ్వాన కమిటీ సభ్యులు తమ్మిశెట్టి బాబ్జీ, అడబాల అయ్యప్ప నాయుడు,  కావలి నాని, పులపర్తి ప్రతాప్, గుగ్గిలపు మురళీ, పులఖండం వీర రాఘవులు, యర్రంశెట్టి నాగేశ్వరరావులు అన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న నర్సాపురం మండలం సీతారామపురం లేసు పార్క్ పక్కన గల  కొండవీటి వారి తోటలోనే ఈ ఏడాది కూడా కాపు, తెలగా సకుటుంబ సమేత వన సమారాధనను 14 వ తేదీ ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు ఉసిరిచెట్టుకు పూజ చేసి వన సమారాధనను ప్రారంభిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఉన్నత హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు హాజరై కాపు జాతి ఐక్యతను చాటుతారని తెలిపారు. పిల్లలకు అవసరమైన ఆటలు, క్రీడలను ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. మహిళలకు మోహేంది, కుర్చీలాట తదితర ఆటలు జరుగుతాయని తెలిపారు. వివిధ వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. నరసాపురం నియోజకవర్గం...

కొండవేటి కృష్ణ ప్రసాద్ ఇక లేరు

Image
భగవాన్ న్యూస్:  నర్సాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొండవేటి కృష్ణ ప్రసాద్ (72) హైదరాబాద్లో శనివారం మృతి చెందారు. స్వగ్రామమైన సీతారామపురం గ్రామంలో అత్యక్రియలు నిర్వహించారు. కృష్ణ ప్రసాద్ కు భార్య నాగమణి, కుమార్తె శ్రీదివ్య కలరు. కృష్ణ ప్రసాద్ భౌతికకాయాన్ని మాజీమంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరామ్ తదితర ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు , నాయకులు, బంధుమిత్రులు సందర్శించి నివాళులు అర్పించారు. కృష్ణ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

బాధ్యతగా విధులు నిర్వహించాలి:ఎమ్మెల్యే నాయకర్

Image
భగవాన్ న్యూస్, నరసాపురం:  పారిశుధ్య పనులను మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది  బాధ్యతాయుతంగా నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం నరసాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత ఉద్యోగులు, సిబ్బందితో సమీక్ష సమావేశాన్ని ఆర్డీవో రాజు, కౌన్సిలర్స్, కమిషనర్ తో కలిసి నిర్వహించారు. పట్టణంలో చెత్త డంపింగ్ సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రజలకు పారిశుధ్య పనుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. పట్టణాభివృద్ధి, సంక్షేమం, మంచి ఆరోగ్యమే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కమిషనర్ అంజయ్యను పలు అంశాలపై వివరణ అడిగారు.  సమావేశంలో కౌన్సిలర్స్ వన్నెంరెడ్డి శ్రీనివాస్, కొప్పాడ కృష్ణవేణి,  కోటిపల్లి సురేష్, పాలూరి బాబ్జీ,  కేసరి గంగరాజు, భారతి సురేష్, బొమ్మిడి సూర్యకుమారి, తోట అరుణ, జనసేన పట్టణ అధ్యక్షుడు కోటిపల్లి వెంకటేశ్వరరావు, గోరు సత్తిబాబు తదితరులు ఉన్నారు. 

కార్యకర్తలకు అండగా తెదేపా: పొత్తూరి రామరాజు

Image
భగవాన్ న్యూస్, నరసాపురం:  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని ఆ పార్టీ నర్సాపురం నియోజకవర్గ ఇంచార్జి పొత్తూరి రామాంజనేయరాజు (రామరాజు) అన్నారు. సోమవారం నరసాపురం పట్టణం 31వ వార్డులో తెదేపాకు చెందిన కొండేటి జాన్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందారు. ఈ సందర్భంగా జాన్ కుటుంబ సభ్యులకు రూ 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మత్స్యకార సంఘాల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, కౌన్సిలర్ పాలూరి బాబ్జీల చేతుల మీదుగా రామరాజు అందజేశారు. ప్రజల కోసం, పార్టీ కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. జాన్ పార్టీకి చేసిన సేవలను తెలియజేశారు. 31వ వార్డు టిడిపి అధ్యక్షులు పాలూరి విఘ్నేశ్వర ప్రసాద్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు నాగిడి రాంబాబు తదితరులు ఉన్నారు.

విభిన్న ప్రతిభావంతులే దివ్యాంగులు: ఎమ్మెల్యే నాయకర్

Image
భగవాన్ న్యూస్, నరసాపురం:  దివ్యాంగులు బలహీనులు కాదని, విభిన్న ప్రతిభావంతులని రాష్ట్ర ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. సోమవారం నర్సాపురం పట్టణం వలందరేవులో మదర్ థెరిస్సా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయకర్ పాల్గొని మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఇంద్రధనస్సు పేరుతో 7 వరాలను ప్రకటించిందని, వాటిని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యులు కరుణ కుమారి, దీపిలు మన దేశం గర్వపడేలా రాణించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. తమ ప్రభుత్వం ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల మాదిరిగానే దివ్యాంగులకూ ఏపీఎస్ ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేయడం జరుగుతుందన్నారు. అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు, ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు తదితర పథకాలను ప్రభుత్వం త్వరలో అమలు చేయనుందని నాయకర్ అన్నారు. దివ్య...