Posts

స్వర్ణాంధ్రాలో పాలిసెట్ హెల్ప్ లైన్ సెంటర్

Image
వశిష్ట ప్రగతి, నర్సాపురం:  స్వర్ణాంధ్రా పోలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సెలింగ్ సెంటరును ఏర్పాటు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యామండలి ఉత్తర్వులను జారీచేసిందని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ విద్యా సంస్థల  ఛైర్మన్ కొండవీటి సత్యనారాయణ, కోశాధికారి కొండవీటి వెంకటేశ్వరస్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్మయిలు ఒక ప్రకటనలో తెలిపారు. 2023 సంవత్సరం నుంచి పాలిసెట్ పరీక్షలను నరసాపురం మండలం సీతారామ పురం గ్రామంలో ఉన్న స్వర్ణాంధ్రా పాలిటెక్నిక్ కాలేజి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. పాలిసెట్ 2025 విద్యా సంవత్సరంలో  ర్యాంకులు సాధించిన విద్యార్థులందరూ ఈ నెల 21 వ తేది నుంచి  28 వ తేది వరకు ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటలకు  రోజుకు 15,000 ర్యాంకుల వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుందని వారు పేర్కొన్నారు.   ఆప్షన్స్ 25 వ తేది నుండి 30 వ తేది వకు పెట్టుకోవచ్చనన్నారు. జూలై 7 న అలాట్మెంట్ లిస్టు వస్తుందని, అలా సీటు కేటయించబడిన విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్ వస్తుందన్నారు. విద్యార్థులు దూరప్రయాణం చేయాల...

ఈఏపీ సెట్ ఫలితాల్లో శ్రీసూర్యాకు స్టేట్ ర్యాంకులు. -అభినందించిన ఎమ్మెల్యే నాయకర్

Image
వశిష్ట ప్రగతి, నర్సాపురం:  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో నరసాపురం పట్టణానికి చెందిన శ్రీ సూర్యా కళాశాల విద్యార్థిని, విద్యార్దులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్ధుల భవితవ్యానికి బంగారు బాటలు వేస్తున్న శ్రీ సూర్యా విద్యా సంస్థల అధిపతి ఘంటసాల బ్రహ్మాజీతో పాటు కళాశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులు,  సిబ్బందిని ప్రశంసించారు. ఈఏపీ సెట్ లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వి.కుసుమ వల్లి (2,587),  సిహెచ్ ఉషశ్రీ (3,411), పి. ముఖేష్ (6,241) లతో పాటు 15,000 లోపు  ర్యాంకులు సాధించిన 17 మంది విద్యార్దులను ఎమ్మెల్యే నాయకర్ పుష్పగుచ్చాలతో సత్కరించారు. బీటెక్ తర్వాత ఎంటెక్,  పిహెచ్డి, గేట్ వంటి ఉన్నత కోర్సులను విద్యార్దులు అభ్యసించి శాస్త్రవేత్తలుగా స్థిరపడాలని, తద్వారా దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని నాయకర్ విద్యార్దులకు సూచించారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యుత్...

ఈఏపీ సెట్లో శ్రీసూర్యా విద్యార్ధుల ప్రభంజనం -స్టేట్ ర్యాంకులతో విజయభేరి

Image
వశిష్ట ప్రగతి:  నర్సాపురం పట్టణానికి చెందిన శ్రీ సూర్య కళాశాల విద్యార్దులు ఆదివారం విడుదలైన ఈ ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు.  గతంలో ఎన్నడు లేని విధంగా ఈఏపీ సెట్ ఫలితాల్లో విజయభేరి మోగించిన విద్యా సంస్థగా శ్రీ సూర్య జూనియర్ కాలేజీ రికార్డును కైవసం చేసుకుంది. నరసాపురం పట్టణంలోనే ప్రప్రథమంగా  రికార్డు స్థాయిలో ఇంత మంచి ఈ.ఏ.పి సెట్ ర్యాంకులను విద్యార్దులు సొంతం చేసుకోవడం వల్ల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులలో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.  ఇటువంటి పోటీ పరీక్షల్లో శ్రీ సూర్య విద్యా సంస్థల విద్యార్దులు చరిత్రను సృష్టించడం పట్ల పలువురు ప్రముఖులు,  ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు తదితరులు అభినందించారు. 3411వ ర్యాంకును సిహెచ్ ఉష శ్రీ, 6241వ ర్యాంకును పి ముఖేష్, 10,851 ర్యాంకును యం. బబ్లూ, 12,190 ర్యాంకును పోతాబత్తుల  మానస తులసి, 12982 ర్యాంకును పి భానుప్రసాద్, 13,192 వ ర్యాంకును ఏ త్రినాథ్, 15,496 ర్యాంకును బి సంజన భార్గవి, 16,560 ర్యాంకును పి ధనశ్రీ, 16,900 యన్. సాయి గణేష్, 17,623 ర్యాంకును పి యేసమ్మ, 18224 ర్యాంకును జీ విశాలాక్...

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిత్యకు టౌన్ ఫస్ట్

Image
వశిష్ట ప్రగతి, నరసాపురం:  బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం  విడుదల చేసిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో నరసాపురం పట్టణానికి చెందిన ఆదిత్య కళాశాల విద్యార్థులు టౌన్ ఫస్ట్ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. జూనియర్ ఇంటర్మీడియట్ యం.పి.సి విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులను రావూరి భవాని సుబ్రహ్మణ్యం శ్రీనివాస్ కైవసం చేసుకుని ఆదిత్య విద్యా సంస్థల కీర్తి పతకాన్ని రెపరెపలాడించారు. అదేవిదంగా 470 మార్కులకు గాను 465 మార్కులను పెదపల్లి షన్విత వరసాయి, విస్సా రుతిక దేవిశ్రీ, ఎలిమర్తి జబదై కుమార్, తంగెళ్ల వైష్ణవి, గన్నాబత్తుల లక్ష్మీ సత్య కళ్యాణ్, చిక్కాల బాలాజీ, కరెళ్ల హారిక, గోపు భార్గవి, మల్లుల నవ్యశ్రీ, గుత్తుల వేణి మధుశ్రీ, ములపర్తి హేమకుమారి లు సాధించి ఆదిత్య కళాశాల సత్తాను చాటారు. 464 మార్కులను అడ్డాల అమృత శ్రీ, జంద్యాల వెంకట శృతి, కోపనాతి రామ్ చరణ్, ఆకన సారిక లక్ష్మీ లు సాధించారు. 460 కి పైగా మార్కును 24 మంది విద్యార్దులు సొంతం చేసుకున్నారు. జూనియర్ ఇంటర్మీడియట్   బైపిసి విభాగంలో 440 మార్కులకు 435 మార్కులను తమ్మిశెట్టి సాహితీ, పాల...

కడప మహానాడుకు తెదేపా బృందం

Image
వశిష్ట ప్రగతి:  కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మంగళవారం నుంచి గురువారం వరకు జరుగుతుంది. ఈ వేడుకకు నర్సాపురం నుంచి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంకు భాస్కర నాయుడు, కాగిత వెంకటేశ్వరరావు, తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ, మౌలాలి, మల్లాడి మూర్తి, గల్లా బాబ్జీ, బోగిరెడ్డి ముత్యం,   కడిమి ప్రవీణ్, బోస్ లు ర్యాలీగా కార్లలో కడప మహానాడుకు తరలి వెళ్లారు.

బీజీబీఎస్ కళాశాల ఆస్తులను కాపాడి అభివృద్ధి చేయాలి -కోట్ల రామ్ కుమార్

Image
వశిష్ట ప్రగతి, నరసాపురం:  అన్యాక్రాంతమైన బిజీబియస్ విద్యా సంస్థల ఆస్తులను కాపాడి అభివృద్ధి చేయాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, అఖిలపక్ష కమిటీ సభ్యుడు కోట్ల రామ్ కుమార్ అన్నారు. బుధవారం నర్సాపురం పట్టణం రాయపేట లో బిజీబియస్ కళాశాల వ్యవస్థాపకుడు పద్మశ్రీ అద్దేపల్లి సర్విశెట్టి విగ్రహాం వద్ద అఖిలపక్షం కమిటి ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సర్విశెట్టి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈ  సందర్భంగా రామ్ కుమార్ మాట్లాడుతూ చిన్నతనంలోనే విధవలుగా మారిన మహిళల బాధలను చూసి అద్దేపల్లి సర్విశెట్టి చలించిపోయారని, ఆయనకు వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని స్వగ్రామమైన నరసాపురం వచ్చి స్థిరపడి, మహిళా సంక్షేమం కోసం  పెళ్ళి చేసుకోకుండా బ్రహ్మచారిగా తన యావదాస్తిని సంస్థకు రాసి సేవలు అందించారన్నారు. మహిళలు విద్యావంతులయితే వారిలో చైతన్యం వస్తుందనే తలంపుతో బిజీబియస్ విద్యా సంస్థలను కొంతమంది సహకారంతో  సర్విశెట్టి ఏర్పాటు చేశారన్నారు. దాతల సహకారంతో బిజీబియస్ విద్యా సంస్థలను అభివృద్ధి చేశారే తప్ప, ఎన్నడు సంస్థ ఆస్తులను అమ్ముకోలేదన్నారు....

విద్యుత్ సరఫరా నిలిపివేత: ఇఈ మధుకుమార్

Image
వశిష్ట ప్రగతి:  నరసాపురం 33/ 11 కేవీ పై ఉన్న 11 కేవీ వలందరు రేవు లైన్ మరమ్మత్తుల నిమిత్తం బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని విద్యుత్ శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ కే మధుకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. నర్సాపురం పట్టణం మద్దిపట్లవారి వీధి, మూడు బొమ్మల సెంటర్, పాత బజార్,  పంజా సెంటర్ ప్రాంతాల్లో సుమారు 7 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండదని, విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.